భక్తులతో నిండిపోయిన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

  • తెలంగాణలోని వేములవాడ, కాళేశ్వరం ఆలయాలు రద్దీ
  • ఏపీలోని శ్రీశైలం, అమరావతి, ద్రాక్షారామం కూడా
  • పరమశివుడికి ప్రత్యేక పూజలు
మహా శివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోని వేములవాడ, కాళేశ్వరం ఆలయాలు, ఏపీలోని అమరావతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీశైలంలో రాత్రి పది గంటల నుంచి పాగాలంకరణ, లింగోద్భవ కాల మహాన్యాకల్యాణం నిర్వహించనున్నారు. రాత్రి పన్నెండు గంటలకు భ్రమరాంబికాదేవి–మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవ కల్యాణం నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, శ్రీశైలంలో రద్దీ కారణంగా ఆలయ ప్రధాన రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. పలువురు వీఐపీల వాహనాలు చిక్కుకుపోయాయి.


More Telugu News