సీఎంకు సరైన సలహాలు ఇవ్వనప్పుడు ప్రభుత్వ సలహాదారులు ఎందుకు?: వడ్డే శోభనాద్రీశ్వరరావు

  • ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదన్న వడ్డే
  • సలహాదారులు రాజీనామా చేయాలని సూచన
  • భూములు బలవంతంగా లాగేసుకుంటున్నారని ఆరోపణ
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఉగాది నాటికి పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యం కాదని అన్నారు. ముఖ్యమంత్రికి సరైన సలహాలు ఇవ్వనప్పుడు ప్రభుత్వ సలహాదారులు పదవుల్లో కొనసాగడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుల సూచనలు, సలహాలను సీఎం పట్టించుకోనప్పుడు వారు తమ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు.

 విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, సాగు భూములను పేద ప్రజల నుంచి బలవంతంగా సేకరిస్తున్నారని మండిపడ్డారు. మానవ హక్కుల కమిషన్ రాష్ట్రంలో భూ దోపిడీపై పరిశీలన జరపాలని విజ్ఞప్తి చేశారు. భూసేకరణ చట్టాలను, మార్గదర్శకాలను పట్టించుకోకుండా జీవోలు జారీ చేశారని విమర్శించారు.


More Telugu News