జాదవ్‌పూర్ వర్సిటీ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐకి ఏబీవీపీ షాక్

  • విద్యార్థి సంఘం ఎన్నికల్లో తొలిసారి పోటీలోనే సత్తా
  • ఎస్ఎఫ్ఐని కిందికి నెట్టి రెండో స్థానం
  • ఇకముందు అన్ని స్టూడెంట్ యూనియన్ల ఎలక్షన్లలో పోటీకి నిర్ణయం
కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీ (జేయూ) విద్యార్థి సంఘం ఎన్నికల్లో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ఎస్ఎఫ్ఐకి షాకిచ్చింది. కమ్యూనిస్టుల కంచుకోటగా భావించే జేయూలో మొదటి సారి పోటీ పడినప్పటికీ సత్తా చూపించింది. జేయూ ఇంజనీరింగ్ డిపార్ట్ మెంట్ లో ఎస్ఎఫ్ఐని వెనక్కు నెట్టి రెండో స్థానం కైవసం చేసుకుంది.

రెండింటికీ పైన డీఎస్ఎఫ్

కౌంటింగ్ లో తొలుత ఎస్ఎఫ్ఐ ట్రెండ్ నడిచినా..  చివరకు దానికంటే ఎక్కువ ఓట్లు సాధించిన ఏబీవీపీ రెండో స్థానంలోకి వచ్చింది. అయితే, మొదటి స్థానం సాధించిన డీఎస్ఎఫ్ ఈ రెండు సంఘాలకు అందనంత ఎత్తులో నిలిచింది. మొత్తం 1405 ఓట్లలో డీఎస్ఎఫ్ ఏకంగా 1167 ఓట్లు కైవసం చేసుకుంది. ఏబీవీపీకి 116 ఓట్లు రాగా.. ఎస్ఎఫ్ఐ కేవలం 60 ఓట్లకే పరిమితమైంది.

అన్నింటిలో పోటీకి ఏబీవీపీ నిర్ణయం

ఈ ఏడాది స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ లో అన్ని పోస్టులకు పోటీ పడాలని నిర్ణయించుకున్న ఏబీవీపీ ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్‌ విభాగాల్లో  తొలిసారి నాలుగు పోస్టుల్లో బరిలో నిలిచింది. కాగా సైన్స్ విభాగంలో డబ్ల్యూయూటీఐ మరోసారి విజేతగా నిలిచింది.


More Telugu News