క్రికెట్​ కు గుడ్​ బై చెప్పిన బౌలర్​ ప్రజ్ఞాన్​ ఓజా

  • అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన స్పిన్ బౌలర్
  • తర్వాతి స్టేజీకి వెళ్లాల్సి ఉందంటూ ట్వీట్
  • 2012 నుంచే అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరం
భారత స్పిన్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు శుక్రవారం ప్రకటించాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. తాను ఇక తర్వాతి స్టేజీకి వెళ్లాల్సి ఉందని పేర్కొన్నాడు. తాను ఇంతకాలం కెరీర్ లో కొనసాగడానికి, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని అన్నాడు. అందరూ ఎప్పటికీ తన వెంట ఉండాలని, తనకు మార్గదర్శనం చేయాలని కోరారు.

ఓ దశలో టాప్–5కి చేరిన ఓజా

ప్రజ్ఞాన్ ఓజా 2008లో భారత్ తరఫున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. స్పిన్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మన్ ను గడగడలాడించాడు. ఒక దశలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్–5వ స్థానాన్ని కూడా సంపాదించాడు. ఐపీఎల్ చరిత్రలో పర్పుల్ క్యాప్ అందుకున్న మొదటి స్పిన్నర్ గా కూడా నిలిచాడు. మొత్తం మీద భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు మాత్రమే ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 113 వికెట్లు పడగొట్టాడు.
  • 2012 నుంచి అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు.
  • ఐపీఎల్ లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు.
  • 2014 చివర్లో ఓజా బౌలింగ్ పై సందేహాలు వ్యక్తం చేస్తూ ఐసీసీ ఆయన బౌలింగ్ ను నిషేధించింది. రెండు నెలల్లోనే తిరిగి అనుమతి తెచ్చుకున్నాడు.


More Telugu News