తెలంగాణ ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టాడు: విజయసాయిరెడ్డి
- అహ్మద్ పటేల్ కు రూ.400 కోట్లు పంచారు
- బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు
- అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది
- 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 'అహ్మద్ పటేల్ కు పంపిన రూ.400 కోట్లే కాదు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణ ఎన్నికల్లో రూ.400 కోట్లు ఖర్చుపెట్టాడు. అప్పట్లో దీనిపై జాతీయ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రం సీఎం దేశం మొత్తానికి ఎలక్షన్ ఫండింగ్ చేశాడు' అని చెప్పారు.
'కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు చేసుకొని ఏపీ ట్రాన్స్ కోకు 70 వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లాడు బాబు. ఈ పీపీఏల దళారి ఎవరంటే కిరసనాయిలు. అక్రమ సంపాదన ఆగిపోయిందనే సీఎం జగన్ గారిని పీపీఏల రద్దుపై ప్రధాని మోదీ నిలదీశారని బోగస్ వార్త రాశాడు' అని ఆరోపించారు.