న్యూయార్క్ న్యాయమూర్తిగా కోమటిరెడ్డి సరిత!

  • డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జిగా నియామకం
  • యూఎస్ న్యాయ వ్యవస్థలో పలు విభాగాల్లో పనిచేసిన సరిత
  • నియామకాన్ని ఖరారు చేసిన డొనాల్డ్ ట్రంప్
భారత సంతతికి చెందిన కోమటిరెడ్డి సరిత అనే మహిళకు అమెరికాలో కీలక పదవి దక్కింది. ఆమెను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ న్యాయమూర్తిగా నామినేట్‌ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇప్పటికే యూఎస్ న్యాయ వ్యవస్థలోని వివిధ విభాగాల్లో పనిచేసిన సరిత, ప్రస్తుతం యూఎస్‌ అటార్నీ ఆఫీస్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ (జనరల్‌ క్రైమ్స్‌) డిప్యూటీ చీఫ్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇదే కార్యాలయంలో ఆమె ఇంటర్నేషనల్ నార్కోటిక్స్, మనీ లాండరింగ్‌, హ్యాకింగ్‌ అండ్‌ ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీస్ కో-ఆర్డినేటర్ గానూ పనిచేశారు. బీపీ డీప్‌ వాటర్‌ హారిజన్‌, ఆయిల్‌ స్పిల్‌ అండ్‌ ఆఫ్‌ షోర్‌ డ్రిల్లింగ్‌ జాతీయ కమిషన్‌ తరఫున న్యాయవాదిగా పలు కేసుల్లో సమర్థవంతంగా వాదనలు వినిపించారు.


More Telugu News