బీఎస్-6 ప్రమాణాలతో వచ్చేసిన హోండా షైన్.. ధర రూ. 67,575 మాత్రమే!

  • మార్కెట్లోకి హోండాషైన్ బీఎస్-6 వెర్షన్
  • 14 శాతం అధిక ఇంధన సామర్థ్యం
  • 125 సీసీ విభాగంలో విప్లవాత్మకమన్న కంపెనీ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సరికొత్త హోండాషైన్‌ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 125 సీసీ మోటార్ సైకిల్ విభాగంలో ఇది మరో విప్లవాత్మకమని ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్‌, సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మినోరు కతో తెలిపారు. బీఎస్-4 వెర్షన్‌తో పోలిస్తే దీని ఇంధన సామర్థ్యం 14 శాతం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. హోండాషైన్ ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ. 67,575 మాత్రమే.


More Telugu News