తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్ అరుదైన రికార్డు
- తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉన్న మయాంక్
- 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
- వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం
వెల్లింగ్టన్ టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 34 పరుగులు చేసి అవుటైన మయాంక్.. తొలి సెషన్ మొత్తం క్రీజులో ఉన్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మూడు దశాబ్దాల క్రితం 1990లో మనోజ్ ప్రభాకర్ కివీస్ గడ్డపై ఈ ఘనత సాధించగా, ఇన్నాళ్లకు మళ్లీ మయాంక్ ఆ రికార్డును అందుకున్నాడు. వీరిద్దరూ తప్ప మరెవరూ న్యూజిలాండ్ గడ్డపై తొలి సెషన్ మొత్తం బ్యాటింగ్ చేయలేకపోయారు.
కాగా, ఈ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆది నుంచీ తడబడుతోంది. వరుసపెట్టి వికెట్లు సమర్పించుకుని పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఈ క్రమంలో వర్షం పడడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.