అప్పటి తుగ్లక్ కంటే ఈ తుగ్లక్ బాగా ఫేమస్ అయ్యాడు: చంద్రబాబు
- పీపీఏల రద్దును వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తప్పుబట్టిందన్న చంద్రబాబు
- పెట్టుబడిదారులు బాహాటంగా అసంతృప్తి వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యలు
- ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదని విమర్శలు
ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పందించారు. ఈనాటి తుగ్లక్ గత కాలపు తుగ్లక్ కంటే ఎంతో ఫేమస్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. పీపీఏలు రద్దు చేయడమే కాకుండా, బిల్లులు చెల్లించకపోవడాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక కూడా తప్పుబట్టిందని పేర్కొన్నారు. ఇదే అంశంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని ట్విట్టర్ లో ప్రస్తావించారు. జపాన్ కూడా ఇప్పటికే తీవ్ర పదజాలంతో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసిందని తెలిపారు.
పెట్టుబడిదారులు సైతం బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని, పీపీఏల పునరుద్ధరణకు కొత్త ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేసి, ఒప్పందాలకు న్యాయపరమైన రక్షణ కల్పించాలంటూ కేంద్రంపైనా ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా జగన్ లో చలనం లేదని విమర్శించారు. జగన్ నియంతృత్వ పోకడలు, ప్రతీకార ధోరణులు ఇలాగే కొనసాగితే మాత్రం తదనంతర పరిణామాలకు ఎలాంటి పూచీ ఉండదని వ్యాఖ్యానించారు.