పుల్వామా అటాక్​ లా స్కూల్​ ను పేల్చేస్తాం.. డబ్బు కోసం తొమ్మిదో క్లాస్​ స్టూడెంట్​ బెదిరింపు లేఖ

  • రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన విద్యార్థి
  • ప్రిన్సిపాల్ ను బెదిరిస్తూ ఆయన ఇంటికి లెటర్
  • డబ్బులొస్తాయనే ఈ పని చేశానని పోలీసులకు వెల్లడి
తొమ్మిదో తరగతి విద్యార్థి డబ్బు కోసం తాను చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ ను టార్గెట్ చేశాడు. తమకు రెండు లక్షలు ఇవ్వాలని.. లేకుంటే ఆర్మీపై పుల్వామాలో జరిగిన టెర్రరిస్టు దాడి తరహాలో బాంబు దాడి చేసి స్కూల్ ను పేల్చివేస్తామని బెదిరింపు లేఖ రాశాడు. అటు స్కూల్ బిల్డింగ్ లో, ఇటు ప్రిన్సిపాల్ ఇంట్లో కూడా ఈ లేఖలు విసిరేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. ఉత్తర ప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది.

పొద్దున పేపర్ వేస్తాడు.. తర్వాత చదువు

తనకు వచ్చిన బెదిరింపు లేఖలు చూసిన ప్రిన్సిపాల్ భయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్, ప్రిన్సిపాల్ ఇల్లు ఉన్న ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు.. అదే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈ పని చేసినట్టు గుర్తించారు.
ఆ విద్యార్థి ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్ వేస్తాడని, తర్వాత స్కూలుకు వస్తాడని పోలీసులు చెప్పారు. కష్టపడకుండా డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో బెదిరింపు లేఖ రాశాడని వివరించారు. ఆ అబ్బాయిని పునరావాస కేంద్రానికి తరలించామని వెల్లడించారు.


More Telugu News