వచ్చే నెలలో వంటగ్యాస్​ ధరలు తగ్గుతాయి: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​

  • చలికాలంలో వంట గ్యాస్ వాడకం పెరుగుతుంది
  • అందువల్ల ధరల్లో పెరుగుదల ఉంది
  • నిరంతరంగా పెరుగుతూ పోతున్నాయన్నది సరికాదని వ్యాఖ్య
వంటగ్యాస్ ధరలు మార్చి నెలలో తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ నెలలో వంట గ్యాస్ ధరలు పెరిగాయని, అవి త్వరలోనే తగ్గుతాయని పేర్కొన్నారు. గురువారం చత్తీస్ గఢ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు.

అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి

అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఇక్కడ కూడా ఈ నెలలో వంట గ్యాస్ ధరలు పెరిగాయని కేంద్ర మంత్రి చెప్పారు. అంతే తప్ప వరుసగా పెరుగుతూ పోతున్నాయన్నది సరికాదన్నారు. చలికాలంలో అంతటా కూడా ఎల్పీజీ వినియోగం పెరుగుతుందని, అందువల్ల ఉత్పత్తి, రవాణాపై ఒత్తిడి పెరిగి ధరలు పెరిగేందుకు కారణమవుతుందని పేర్కొన్నారు. వచ్చే నెలలో వంట గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.


More Telugu News