నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు

  • 152 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2 శాతం పైగా పతనమైన ఏసియన్ పెయింట్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయ్యాయి. చివరకు సెన్సెక్స్ 152 పాయింట్లు కోల్పోయి 41,170కి పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 12,080 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.57%), టాటా స్టీల్ (2.48%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.31%), ఓఎన్జీసీ (1.13%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.01%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.30%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.85%), టీసీఎస్ (-1.75%), టెక్ మహీంద్రా (-1.36%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.24%).


More Telugu News