డీజీపీని కలిసినా బీజేపీ శ్రేణులపై కేసులు ఆగడంలేదు: కన్నా
- బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణ
- హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం
- దాడులకు ప్రభుత్వ అండ ఉందంటూ మండిపాటు
ఏపీ బీజేపీ రాష్ట్ర విభాగం సమావేశం విజయవాడ సమీపంలోని పోరంకిలో నిర్వహించారు. స్థానిక పద్మావతి మ్యారేజి ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎంపీ పురందేశ్వరి, కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్, మాజీమంత్రి మాణిక్యాలరావు, రావెల కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఏపీలో బీజేపీ శ్రేణులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసినా అక్రమ కేసులకు అడ్డుకట్టపడడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రభుత్వం అండ ఉన్నట్టు భావిస్తున్నామని అన్నారు.