‘భారతీయుడు-2’ షూటింగ్ ప్రమాద స్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు
- నిన్న రాత్రి ప్రమాదం
- ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఘటన
- క్రేన్ ఆపరేటర్‌పై కేసు
నిన్న రాత్రి చెన్నైలో జరిగిన ‘భారతీయుడు-2’ షూటింగ్లో భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. షూటింగ్ నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. అయితే, క్రేన్ క్రాష్ అవ్వడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు మరో పదిమందికి గాయాలయ్యాయి.
ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలిని పరిశీలించారు. క్రేన్ ఆపరేటర్ రాజన్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.