టీడీపీ, వైసీపీలు పార్టీలు కావు... కార్పొరేట్ కంపెనీలు!: కన్నా లక్ష్మీనారాయణ
- పదాధికారుల సమావేశంలో శ్రేణులకు పిలుపు
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటుదాం
- జనసేనతో కలిసి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదుగుతాం
జనసేనతో కలిసి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడలో జరుగుతున్న పార్టీ పదాధికారుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను జనసేనతో కలిసి ఎదుర్కోవాలని సూచించారు.
పేదలకు అండగా ఉంటే బలమైన శక్తిగా ఎదగవచ్చునని సూచించారు. రాష్ట్రంలో పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ శ్రేణులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో డీజీపీని కలిసినా న్యాయం జరగలేదన్నారు. టీడీపీ, వైసీపీలు రాజకీయ పార్టీలు కావని, కార్పొరేట్ కంపెనీలని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హిందు సంస్కృతి ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించారు.