డ్రాగన్‌కి ఊరట...తొలిసారి చైనాలో తగ్గిన కోవిడ్‌ కేసుల నమోదు సంఖ్య!

  • కొత్తగా వైరస్‌ సోకిన వారి సంఖ్య తగ్గుముఖం
  • వెల్లడించిన చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌
  • ప్రస్తుతం బాధితుల సంఖ్య దాదాపు 75 వేలు
కోవిడ్‌-19 బారినపడి విలవిల్లాడుతున్న చైనాకు నిన్న కాస్త ఊరట లభించింది. కొత్తగా వైరస్‌ సోకిన వారి సంఖ్య గణనీయంగా తగ్గడమే ఈ ఊరటకు కారణం. ఈ విషయాన్ని చైనా జాతీయ ఆరోగ్య మిషన్‌ వ్లెడించింది. ‘నిన్న కొత్తగా 394 మందికి వైరస్‌ సోకింది. ఇటీవల కాలంలో ఒక రోజులో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం నిన్ననే. దీంతో దేశంలో వైరస్‌ సోకిన వారి సంఖ్య 74,756కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 16,155 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు’ అని ఆ నివేదిక పేర్కొంది.

కాగా, నిన్న కోవిడ్‌కు 114 మంది చనిపోగా ఒక్క హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే 108 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 2,118కి చేరింది. కోవిడ్‌ ప్రభావం హెబెయ్‌, వూహాన్‌లోనే అత్యధికంగా ఉంది. మరోవైపు డైమండ్‌ ప్రిన్స్‌ నౌకలో చిక్కుకుని వైరస్‌ సోకిన వారిలో ఇద్దరు చనిపోయినట్లు స్థానిక మీడియా వ్లెడించింది.


More Telugu News