రూ.కోటి చెక్కుతో ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్

  • కాసేపట్లో కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయానికి పవన్
  • అమర సైనికుల కుటుంబాల సంక్షేమానికి విరాళం 
  • మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్‌కు పవన్ 
  • విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్న జనసేనాని 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి, అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును అందజేస్తారు. 'ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే' సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు ఈ విరాళం అందజేయనున్నారు.
      
కాగా, ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయనతో పాటు పలువురు ప్రముఖులు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, మేఘాలయ శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు పాల్గొంటారు.


More Telugu News