విజిలెన్స్ నూతన చీఫ్‌గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి

  • ప్రధాన సమాచార కమిషనర్‌గా బిమల్ జుల్కా
  • విజిలెన్స్ కమిషనర్‌గా సురేశ్ పటేల్, సమాచార కమిషనర్‌గా అనితా పండోవేని
  • ఎంపికపై విమర్శలు కురిపించిన కాంగ్రెస్
చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వద్ద కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ కొఠారిని నియమించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. ఉన్నత పదవుల ఎంపికలో పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా పోతోందని దుయ్యబట్టింది. సీవీసీగా సంజయ్ కొఠారిని నియమిస్తూ ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంంది.

అలాగే, సమాచార కమిషనర్‌గా ఉన్న బిమల్ జుల్కా ప్రధాన సమచార కమిషనర్ (సీఐసీ)గా ఎంపికచేసింది. సురేశ్ పటేల్‌ను విజిలెన్స్ కమిషనర్‌గా, అనితా పండోవేనిని సమాచార కమిషనర్‌గా ఎంపిక చేశారు. ఈ నియామకాలను కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి తీవ్రంగా వ్యతిరేకించారు. మరో నేత రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ ఉన్నత పదవుల నియామకాల్లో పాదర్శకత లేకుండా పోయిందని ఆరోపించారు.


More Telugu News