భారత్ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం స్వల్పమే: ఆర్బీఐ గవర్నర్

  • చైనా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్!
  • భారత్ లోని పలు రంగాలు కొద్దిగా కుదుపులకు గురయ్యాయన్న శక్తికాంత దాస్
  • మన వద్ద పరిష్కార మార్గాలు ఉన్నాయని వెల్లడి
ఓవైపు చైనా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే రీతిలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ పై కరోనా వైరస్ ప్రభావం స్వల్పమేనని తెలిపారు. అయితే చైనా ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా విస్తరించి ఉండడంతో కరోనా ప్రభావంతో ప్రపంచ వృద్ధిరేటు, ప్రపంచ వాణిజ్యం ప్రభావితం అవుతున్నాయని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా భారత్ లోని పలు రంగాలు కొద్దిగా కుదుపులకు గురైనా, వాటికి పరిష్కార మార్గాలు లభించాయని వివరించారు. చైనాలో ఆర్థిక మందగమనం మన ఎలక్ట్రానిక్స్, ఫార్మా రంగాలపై ప్రభావం చూపుతోందని, అది కూడా కొద్దిమేర మాత్రమేనని తెలిపారు.


More Telugu News