అత్యాచారం చేసి.. మొబైల్ నంబర్లు ఇచ్చి మరీ వెళ్లిన కీచకులు
- హర్యానాలోని కర్నల్ టోల్‌ప్లాజా వద్ద ఘటన
- మూత్ర విసర్జన కోసం వెళ్లిన మహిళను బెదిరించి అత్యాచారం
- నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు
హర్యానాలో ఓ మహిళ(19) పై ఇద్దరు ఆగంతుకులు అత్యాచారానికి పాల్పడి, ఆపై తమ మొబైల్ నంబర్లు ఇచ్చి మరీ వెళ్లారు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బంధువులను కలిసేందుకు పానిపట్‌కు వెళ్లిన పంజాబ్ దంపతులు ఆదివారం తిరిగి ఇంటికి బయలుదేరారు. తమ సన్నిహితులు రూ. 20 వేలు ఇస్తానంటే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో కర్నల్ టోల్‌ప్లాజా వద్ద ఆగారు.
ఈ క్రమంలో బాధిత మహిళ మూత్ర విసర్జన కోసం టోల్‌ప్లాజా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు కత్తితో బెదిరించి నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అనంతరం వారి మొబైల్ నంబర్లు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. విషయం భర్తకు చెప్పిన బాధితురాలు సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల ఫోన్ నంబర్ల ఆధారంగా వారిని టోల్‌ప్లాజా వద్ద చిప్స్ విక్రయించే మేఘరాజ్, సోనూలుగా గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.