పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. పరుగులు పెడుతున్న పసిడి

  • పది గ్రాములకు రూ. 462 పెరిగి రూ. 42,339కి చేరుకున్న పుత్తడి ధర
  • కిలో వెండిపై ఏకంగా రూ.1,047 పెరుగుదల 
  • బంగారంపై పెరిగిన మదుపర్ల పెట్టుబడులు
పెళ్లిళ్ల సీజన్ పుణ్యమా అని బంగారం ధర కళ్లేలు లేకుండా పరుగులు పెడుతోంది. ఢిల్లీలో ఈ రోజు స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు రూ. 462 పెరిగి రూ. 42,339కి చేరింది. కరోనా వైరస్ ప్రభావం మార్కెట్లపై పడడంతో బంగారంపై పెట్టుబడులే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. ఈ కారణంగానే పుత్తడి ధరలు పెరిగినట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి ధర పెరుగుదలకు మరో కారణమని చెబుతున్నారు. మరోవైపు వెండి కూడా పసిడి దారిలోనే పయనించింది. నేడు కిలోకు రూ.1,047 పెరిగి రూ.48,652 దగ్గర ఆగింది.


More Telugu News