రద్దుల రాజు కథ చెప్పిన నారా లోకేశ్!
- జగన్ పై విమర్శలు చేసిన లోకేశ్
- మన తుగ్లక్ కు ప్రజలన్నా, కోర్టులన్నా భయం లేదని వ్యాఖ్యలు
- కేవలం కేంద్రంలో పెద్దలకే భయపడతాడని ఎద్దేవా
సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. చిన్నపిల్లల కథల పుస్తకంలో రద్దుల రాజు అనే కథను ప్రస్తావిస్తూ జగన్ పై విమర్శలు చేశారు.
ఈ కథలోని రద్దుల రాజు లాగే మన తుగ్లక్ పరిస్థితి కూడా ఉందని పేర్కొన్నారు. కనీసం ఈ రద్దుల రాజు చివరికి ప్రజాగ్రహానికి తలొగ్గుతాడని, కానీ మన తుగ్లక్ మాత్రం ఎవరికీ భయపడడని వ్యాఖ్యానించారు. "ప్రజలు అంటే భయం లేదు. కోర్టులంటే భయం లేదు. ఎక్కడ జైల్లో తోస్తారోనని కేవలం కేంద్రంలో ఉన్న పెద్దలంటేనే భయం. "