కనురెప్పల్ని సైతం మాయచేయగల వైసీపీ నేతలు ఇదేదో కొత్త పథకం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు: చంద్రబాబు
- వైఎస్సార్ కంటివెలుగు పేరిట పథకం అమలు
- ఇది కొత్త పథకం కాదన్న చంద్రబాబు
- టీడీపీ హయాంలోనే ప్రారంభమైందని వెల్లడి
- 11 లక్షల మందికి ఆపరేషన్లు చేయించామన్న చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని భారీ ఎత్తున అమలు చేస్తుండడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కనురెప్పల్ని సైతం మాయచేయగల వైసీపీ నేతలు ఇప్పుడు కంటివెలుగు పథకం అంటే ఏదో కొత్త పథకం అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. ఇదేమీ కొత్త పథకం కాదని, టీడీపీ హయాం నుంచి అమలు చేస్తున్నదేనని వెల్లడించారు.
తమ ప్రభుత్వ కాలంలో ఈ పథకం కింద 11 లక్షల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించామని చంద్రబాబు వివరించారు. టీడీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 222 ఇ-ఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 67 లక్షల మందికి కంటి చికిత్స అందించామని తెలిపారు. 3 లక్షల మంది విద్యార్థులకు కూడా ఉచితంగా కళ్లద్దాలు ఇచ్చామని, ఇప్పుడు ఈ పథకానికి పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం మాయ చేస్తోందని విమర్శించారు.