కష్టకాలంలో భారత్ స్నేహహస్తం మర్చిపోలేనిది : చైనా రాయబారి సున్ వీడోంగ్
- ఎన్నో సందర్భాల్లో మా వెన్నంటే నిలిచిన దేశం
- కోవిడ్‌పై చైౖనాకు సాయమందించిన జాబితాలో భారత్ పేరు గల్లంతు
- దీనిపై దుమారం చెలరేగడంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన డ్రాగన్
కష్టకాలంలో భారత్ ఎప్పుడూ మా వెన్నంటే ఉందని, వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడోంగ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కోవిడ్-19తో చైనా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ కష్టకాలంలో భారత్ సహా చైనాకు ఎన్నో దేశాలు తమదైన మార్గంలో సహాయం అందించాయి. భారత్ నుంచి చైనాకు భారీ ఎత్తున వైద్య పరికరాల సరఫరా జరుగుతోంది. ఇందుకు కృతజ్ఞతగా చైనా తమకు సాయమందించిన 57 దేశాల జాబితాను విడుదల చేసింది.
ఇందులో భారత్ పేరు లేకపోవడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. పలువురు భారతీయులు అక్కసు వెళ్లగక్కారు. దీంతో జరిగిన పొరబాటును గుర్తించిన చైనా రాయబారి దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేశారు. కోవిడ్ విషయంలో భారత్ అందిస్తున్న సాయాన్ని కొనియాడారు.
చైనా కష్టాల్లో ఉన్న ప్రతిసారీ భారత్ స్నేహ హస్తం అందిస్తూనే ఉందని వీడోంగ్ అన్నారు. 2003లో సార్స్ వైరస్ ప్రబలినప్పుడు కూడా భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు.