ట్రంప్ కి భారత్ లో భక్తజనం.. తెలంగాణవాసి ఇంట్లో విగ్రహం!

  • విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఒకరు
  • ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న మరికొందరు
  • వచ్చేసరికి మరెన్ని సిత్రాలు చూడాలో
అమెరికాను పలు సందర్భాల్లో ఆడిపోసుకునే వారు ఎంత ఎక్కువ మందో, ప్రపంచ పెద్దన్న అంటే మోజుపడే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారనిపిస్తుంది. ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం దేశంలో పలుచోట్ల ట్రంప్‌ మేనియా నడుస్తోంది.

తెలంగాణకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ బుస్సా కృష్ణ అనే వ్యక్తి ఏకంగా ట్రంప్‌ విగ్రహాన్ని తన ఇంట్లోనే ప్రతిష్ఠించి రోజూ పాలాభిషేకం చేస్తున్నాడు. అతని చర్యతో పరువుపోతోందని కుటుంబ సభ్యులు ఎంత మొత్తుకుంటున్నా అతను వినడం లేదు.

ఏం అంటే ‘2016లో ట్రంప్‌ నా కలలో కనిపించాడు. అప్పటి నుంచి అతన్ని పూజించడం ప్రారంభించాను. దీనివల్ల నాకు వ్యాపారం కలిసొచ్చింది. లాభాలు వచ్చాయి. ఇదంతా ట్రంప్‌ భగవానుడి చలవే. అందుకే మిగిలిన వారంతా శివుడిని ఎలా పూజిస్తారో నేను ట్రంప్‌ని అలా పూజిస్తా’ అంటూ ఉబ్బితబ్బిబ్బయి పోతున్నాడు కృష్ణ.

మరోవైపు న్యూఢిల్లీకి చెందిన హిందూ సేన సభ్యులు కూడా ట్రంప్‌పై భక్తిభావంతో ఊగిపోతున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏం అంటే ‘ట్రంప్‌ కూడా మాలాగే ఇస్లామిక్‌ ఉగ్రవాదానికి వ్యతిరేకం. ఇస్లామిక్‌ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని ప్రయత్నిస్తుండడం మాకు నచ్చింది’ అని చెప్పుకొస్తున్నారు. ఈ మేనియా ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.


More Telugu News