కేటీఆర్ విన్నపానికి క్షణాల్లో ఓకే చెప్పిన కేసీఆర్... తక్షణం నిధులు మంజూరు!
- హైదరాబాద్ లో జ్యోతీరావు ఫూలే విగ్రహం
- భారీ విగ్రహ ఏర్పాటుకు గతంలోనే హామీ
- అంబేద్కర్ విగ్రహం కూడా
బడుగు జనుల ఆశాజ్యోతి జ్యోతీరావు ఫూలే భారీ విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్న సీఎం కేసీఆర్, విగ్రహ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం నాడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొత్తగా ఎన్నికైన పురపాలక ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వేళ, గతంలో ఇచ్చిన మాటను ప్రస్తావించిన కేటీఆర్, ఫూలే విగ్రహ ఏర్పాటుకు ఆమోదం పలకాలని కోరారు.
ఆ వెంటనే స్పందించిన కేసీఆర్, విగ్రహ ఏర్పాటుకు అంగీకరిస్తూ, ఈ విగ్రహం, దేశంలోనే అతి పెద్ద ఫూలే విగ్రహంగా ఉండాలని కోరారు. ఇదే సమయంలో గతంలో చెప్పినట్టుగా భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను వెంటనే ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. రెండు విగ్రహాలకూ తక్షణం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.