ఆ బస్సును ఎత్తుకెళ్లింది అవుట్ సోర్సింగ్ ఉద్యోగే: దొరికిన ఆర్టీసీ బస్సు దొంగ
- రెండు రోజుల క్రితం బస్సును చోరీ చేసిన ఘనుడు
- లారీని ఢీకొట్టి పరారీ
- జల్సాలకు డబ్బు సరిపోకపోవడంతోనే చోరీ
బస్టాండ్‌లో ప్రయాణికులతో నిండివున్న ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం తెలంగాణలోని తాండూరు డిపోకు చెందిన బస్సు కరన్‌కోట్ బస్టాండులో ఉండగా ఓ వ్యక్తి దానిని అపహరించాడు. కండక్టరు లేకుండానే బస్సు కదలడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు అతడిని ప్రశ్నిస్తే ఆ బస్సుకు డ్రైవర్ కమ్ కండక్టర్‌ను తానేనని బదులిచ్చాడు. ఆ తర్వాత కాసేపటికే ఓ లారీని ఢీకొట్టి బస్సును రోడ్డుపైనే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఆర్టీసీలోనే పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆంజనేయులుగా గుర్తించారు.
బస్సుల వాషింగ్ సెంటర్లో పనిచేస్తున్న ఆంజనేయులు తాగిన మత్తులో బస్సును ఎత్తుకెళ్లాడని పోలీసులు తెలిపారు. జల్సాలకు అలవాటు పడిన ఆంజనేయులు జీతం సరిపడకపోవడంతో బస్సు ఎత్తుకెళ్లి దాని విడిభాగాలు అమ్మి సొమ్ము చేసుకోవాలని భావించాడని పేర్కొన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు.