వీఎల్ దత్ మృతికి సంతాపం తెలిపిన వెంకయ్య, చంద్రబాబు
- కేసీపీ సంస్థల అధినేత వీఎల్ దత్ కన్నుమూత
- దత్ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించిన వెంకయ్య
- ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామికవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ మృతి చెందడం పట్ల భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. వెంకయ్యనాయుడు ఆయన కుటుంబసభ్యులను ఫోన్ లో పరామర్శించారు. దత్ మృతి భారత పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో దత్ సేవలు మరువలేమని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడుల విధానంలో దత్ నిష్ణాతుడని కీర్తించారు.
చంద్రబాబు స్పందిస్తూ, దత్ మృతికి సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పరిశ్రమల అభివృద్ధికి వీఎల్ దత్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. పల్నాడు, ఉయ్యూరు ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. సామాజిక సేవ, భాషాభివృద్ధికి దత్ చేసిన సేవలు నిరుపమానమని పేర్కొన్నారు.