సినీ నటి శ్రీరెడ్డిపై మరో నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు

  • తనపై శ్రీరెడ్డి అసభ్య వ్యాఖ్యలు చేసిందని ఆరోపణ
  • సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు  
  • శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరిన కరాటే కల్యాణి
తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచే సినీ నటి శ్రీరెడ్డిపై టాలీవుడ్ నటి కరాటే కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమం వేదికగా తనపై శ్రీరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ కరాటే కల్యాణి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై చర్యలు చేపట్టాలని ఆ ఫిర్యాదులో ఆమె కోరినట్టు సమాచారం. శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసే ఉద్దేశంలో పోలీసులు ఉన్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గతంలో కరాటే కల్యాణిపై శ్రీరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో తనపై కల్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసిందని నాడు తన ఫిర్యాదులో శ్రీరెడ్డి ఆరోపించింది.


More Telugu News