దేశం దాటి వెళితే జగన్ అరెస్ట్ అవుతారు: బోండా ఉమ

  • అరెస్ట్ భయంతోనే జగన్ విదేశాలకు వెళ్లడం లేదన్న ఉమ
  • దుబాయ్ సదస్సుకు వెళ్లకపోవడానికి కారణం అదేనని వెల్లడి
  • నిమ్మగడ్డ జీవితం సెర్బియాకే అంకితం అంటూ వ్యాఖ్యలు
ఏపీలో ఐటీ దాడుల పర్యవసానంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో విమర్శల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత బోండా ఉమ ఘాటుగా స్పందించారు. అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఏపీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లడం లేదని అన్నారు. దుబాయ్ లో పెట్టుబడుల సదస్సు జరిగినా జగన్ వెళ్లకపోవడానికి కారణం అదేనని చెప్పారు.

వాన్ పిక్ వ్యవహారంలో రస్ అల్ ఖైమా సంస్థ అంతర్జాతీయ న్యాయస్థానాలను ఆశ్రయించిందని, ఈ కేసులో జగన్ తో పాటు ఇతర నిందితులు దేశం దాటి వెళితే అరెస్ట్ అవడం ఖాయమని ఉమ తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నిమ్మగడ్డ ప్రసాద్ జీవితం ఇక సెర్బియా దేశానికి అంకితం అని జోస్యం చెప్పారు. నిమ్మగడ్డ అప్రూవర్ గా మారినట్టు అర్థమవుతోందని, జగన్ తో పాటు ఇతర నిందితులను అప్పగించాలని ప్రధాని మోదీని రస్ అల్ ఖైమా సంస్థ కోరిందని అన్నారు.


More Telugu News