'ఈ రైతు వెరీ వెరీ స్పెషల్' అంటున్న వీవీఎస్ లక్ష్మణ్!

  • ట్విట్టర్ లో స్పందించిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్
  • బాబుల్ దహియా అనే రైతు గురించి ప్రస్తావన
  • 2 ఎకరాల్లో 110 వరి రకాలు పండించాడంటూ ట్వీట్
  • ఎలాంటి రసాయనిక ఎరువులు ఉపయోగించలేదని వెల్లడి
భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే క్రికెటర్లలో హైదరాబాద్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఉంటాడు. లక్ష్మణ్ ఆటకు వీడ్కోలు పలికాక కామెంటేటర్ గా సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే లక్ష్మణ్ ట్విట్టర్ లో సామాజిక హిత అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా ఆయన పోస్టు చేసిన అంశం కూడా అలాంటిదే. బాబుల్ దహియా అనే మధ్యప్రదేశ్ రైతు గురించి వెల్లడించారు.

"బాబుల్ దహియా మధ్యప్రదేశ్ లోని సత్నా ప్రాంతానికి చెందిన రైతు. పర్యావరణానికి హాని కలిగించరాదన్న సిద్ధాంతాన్ని అమలు చేయడంలో ఆయన నిజంగానే అద్భుతం చేశారు. కేవలం 2 ఎకరాల పొలంలో 110 రకాల వరి పంటలను పండించారు. అది కూడా ఎలాంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా! బాబుల్ దహియా పండించిన ప్రతి వరి రకానిది ఒక్కోటి ఒక్కో రుచి. ఈ వరి రకాల ముందు హైబ్రిడ్ వరి కూడా దిగదుడుపే" అని లక్ష్మణ్ ట్వీట్ చేశారు.


More Telugu News