నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
  • 161 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 38 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు నష్టపోయి 40,894కి పడిపోయింది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 12,007 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.37%), ఇన్ఫోసిస్ (1.08%), టెక్ మహీంద్రా (0.72%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.71%), టీసీఎస్ (0.62%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.01%), భారతి ఎయిర్ టెల్ (-2.68%), మారుతి సుజుకి (-1.61%), హీరో మోటో కార్ప్ (-1.56%), నెస్లే ఇండియా (-0.95%).


More Telugu News