నా ఫస్టు సినిమాకే పరుచూరి బ్రదర్స్ తో గొడవపడ్డాను: దర్శకుడు బి.గోపాల్

  • పరుచూరి బ్రదర్స్ తో మంచి సాన్నిహిత్యం వుంది 
  • కథ విషయంలో నేను పట్టుబట్టేవాడిని 
  • తమ అనుబంధం అలాగే ఉందన్న బి.గోపాల్    
'సమరసింహా రెడ్డి' సినిమాతో ఫ్యాక్షన్ సినిమాలకు తెరలేపిన బి.గోపాల్, ఆ సినిమాను బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలబెట్టారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన తొలి సినిమా 'ప్రతిధ్వని' గురించి ప్రస్తావించారు. "పరుచూరి బ్రదర్స్ తో నాకు సాన్నిహిత్యం ఎక్కువ. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నప్పటి నుంచి నాకు వాళ్లతో మంచి చనువు వుండేది. అలాంటి పరుచూరి బ్రదర్స్ తో నేను మొదటి సినిమాకే గొడవ పడాల్సి వచ్చింది .. అదీ 'ప్రతిధ్వని' కథ విషయంలోనే.

కథలో ఎక్కడో తప్పు జరుగుతోంది .. కరెక్టుగా ఉండాలి అని పట్టుబట్టాను. అప్పటికే వాళ్లు ఎన్టీ రామారావు .. నాగేశ్వరావు .. శోభన్ బాబు .. కృష్ణ గార్లకు ఎన్నో హిట్లు ఇచ్చి వున్నారు. వాళ్లతో గొడవ పెట్టుకుంటే కెరియర్ ప్రోబ్లమ్ లో పడుతుందని కూడా నేను ఆలోచించలేదు .. కథ కోసం పోరాడాను. కథలో బెటర్మెంట్ కోసం వాళ్లిద్దరి మధ్య కూడా వాదన జరుగుతుండేది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ మా అనుబంధం మాత్రం కొనసాగుతూనే వుంది" అని చెప్పుకొచ్చారు.


More Telugu News