పచ్చ మీడియా ఇలా కిందా మీదా పడుతోంది: విజయసాయిరెడ్డి
- ఇన్ కంటాక్స్ కమిషనర్‌ను దూషించే స్థాయికి వెళ్లి పోయింది
- 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించారు
- అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్న విజయసాయి
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ సోదాల విషయంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూనే వున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పందించారు.
'చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి పచ్చ మీడియా కిందా మీదా పడుతోంది. ఇన్ కంటాక్స్ కమిషనర్ సురభి అహ్లూవాలియాను కూడా దూషించే స్థాయికి వెళ్లి పోయింది. 2,000 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తిస్తే.. కాదు రెండు లక్షల నగదు మాత్రమే దొరికిందని అబద్ధపు ప్రచారం మొదలు పెట్టింది' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.