మన్మోహన్ ను రాహుల్ అగౌరవపరిచారనే వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన

  • మన్మోహన్ ను రాహుల్ ఒక గురువుగా భావిస్తారు
  • మన్మోహన్ ను అగౌరవపరచాలనే ఆలోచన కాంగ్రెస్ కు లేదు
  • రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండాలా? అనేదే అసలైన సమస్య
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను అగౌరవపరచాలనే ఆలోచన కూడా రాహుల్ గాంధీకి లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. 2013లో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఓ ఆర్టినెన్స్ కాపీని రాహుల్ చించేశారని... తద్వారా మన్మోహన్ ను అగౌరవపరిచారంటూ ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తాజాగా ఆరోపించిన సంగతి తెలిసిందే.

అహ్లూవాలియా వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా మాట్లాడుతూ, క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఆర్టినెన్స్ ను రాహుల్ చించేయడం ఒక సాహసోపేతమైన చర్య అని అన్నారు. మన్మోహన్ ను రాహుల్ ఒక గురువుగా భావిస్తారని చెప్పారు. మన్మోహన్ ను అగౌరవపరచాలనే ఆలోచన రాహుల్ కు కానీ, కాంగ్రెస్ కు కానీ లేదని అన్నారు. ఆర్డినెన్స్ చింపడమనేది సమస్య కాదని... నీతివంతమైన రాజకీయాలే సమస్య అని చెప్పారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉండాలా? అనేదే సమస్య అని అన్నారు.


More Telugu News