తనతో చేతులు కలిపిన ప్రశాంత్ కిశోర్ కు జడ్ కేటగిరీ భద్రతను ప్రకటించిన మమతా బెనర్జీ!
- త్వరలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
- హ్యాట్రిక్ పై కన్నేసిన మమతా బెనర్జీ
- ప్రశాంత్ కిశోర్ కు భద్రతపై విపక్షాల విమర్శలు
సమీప భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ కు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సేవలను అందుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే జేడీయూను వీడిన ప్రశాంత్ కిశోర్, ప్రస్తుతం తృణమూల్ కు సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని మమత సర్కారు నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర సచివాలయం వర్గాలు వెల్లడించాయి.
కాగా, ప్రభుత్వ సొమ్ముతో ప్రశాంత్ కిశోర్ కు భద్రతను ఎలా కల్పిస్తారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మమతా బెనర్జీ కేవలం స్వప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు.
కాగా, ప్రభుత్వ సొమ్ముతో ప్రశాంత్ కిశోర్ కు భద్రతను ఎలా కల్పిస్తారని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. మమతా బెనర్జీ కేవలం స్వప్రయోజనాలను మాత్రమే చూసుకుంటున్నారని సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మండిపడ్డారు.