హైదరాబాద్‌లో ఘోరం.. భరత్‌నగర్ బ్రిడ్జిపై నుంచి కిందపడిన కారు
- అదుపు తప్పి కిందపడిన కారు
- ఒకరు మృతి, నలుగురికి గాయాలు
- తెలియని బాధితుల వివరాలు
హైదరాబాద్‌లోని భరత్‌నగర్ బ్రిడ్జిపై నుంచి గత రాత్రి ఓ కారు అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. కారు పైనుంచి పడిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.