ఇప్పటికే జగన్ ని ప్రజలు నమ్మడం లేదు.. ఇక ఎన్డీఏలో చేరితే ‘మటాష్‘: సీపీఐ రామకృష్ణ
- కేంద్రం, జగన్ సర్కార్ లోపాయికారి రాజకీయాలు
- ఎన్డీఏలో చేరాలని జగన్ ఆలోచిస్తున్నారు
- మోదీతో లాలూచీ పడుతున్నట్టే
విజయవాడలోని స్థానిక లెనిన్ సెంటర్ లో వామపక్ష నేతలు ఈరోజు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీలో జగన్ సర్కార్ కలిసి చేస్తున్న లోపాయికారి రాజకీయాలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వామపక్ష పార్టీలు మండిపడుతూ ఈ ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహించి వీటి తీరును ఎండగడతామని హెచ్చరించారు. ఎన్డీఏలో చేరాలని ఆలోచిస్తున్నారంటే మోదీతో లాలూచీ పడుతున్నట్టేనని, ఇప్పటికే జగన్ ని ప్రజలు నమ్మడం లేదని, ఇక ఎన్డీఏలో చేరితే ‘మటాష్‘ అంటూ విమర్శించారు.
కేంద్రం నాటకం అర్థమవుతోంది
మన రాష్ట్రంలో సమస్యలకు కేంద్రమే కారణమన్న అనుమానం ప్రజల్లో ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. వైసీపీ వ్యాఖ్యలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం అర్థమవుతోందని, ఈ నాటకం కారణంగా రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు.