జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు కోరుతూ... స.హ.చట్టం కింద దరఖాస్తు పంపిన సీపీఐ నేత రామకృష్ణ

  • ఇటీవల ఢిల్లీలో ప్రధాని, మంత్రులను కలసిన సీఎం జగన్ 
  • కేంద్రానికి జగన్ ఏమి విజ్ఞాపనలు చేశారు?
  • అలాగే, కేంద్రం ఇచ్చిన హామీలు కూడా చెప్పమని కోరిన సీపీఐ నేత
సమాచార హక్కు చట్టం (స.హ.చట్టం) కింద ఏపీ సీఎస్ నీలం సాహ్నికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ దరఖాస్తు పంపారు. సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని కోరుతూ ఈ దరఖాస్తులో కోరారు. కేంద్రానికి  సీఎం ఇచ్చిన విజ్ఞాపనలు, కేంద్రం ఇచ్చిన హామీల వివరాలు తెలియజేయాలని కోరారు.

సీఎస్ ను కలసిన ఉద్యోగ ఐకాస.. విజ్ఞప్తి! 

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ ఐకాస నేతలు ఇవాళ నీలం సాహ్నిని కలిశారు. ఆరోగ్యకార్డులకు సంబంధించిన బకాయిల కారణంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే తమకు వైద్యం చేయడం లేదని ఆమె దృష్టికి తెచ్చారు. ఆరోగ్యకార్డులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని విజ్ఙప్తి చేశారు. 4వ తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, మహిళా ఉద్యోగులకు 5 రోజుల ప్రత్యేక సెలవులు ఇవ్వాలని కోరారు. సీపీఎస్ రద్దు అంశంపై సీఎం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఐకాస నేతలు విజ్ఙప్తి చేశారు.


More Telugu News