హైదరాబాద్ లో త్వరలో బీజేపీ బహిరంగసభ.. హాజరుకానున్న అమిత్ షా, పవన్ కల్యాణ్
- సీఏఏకు మద్దతుగా బీజేపీ బహిరంగసభ
- వచ్చే నెల 14న ఎల్బీ స్టేడియం వేదికగా సభ
- ఏర్పాట్లు ప్రారంభించే పనిలో బీజేపీ శ్రేణులు
జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు మద్దతుగా హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. వచ్చే నెల 14న జరిగే ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించే ఈ సభలో అమిత్ షా, పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. కాగా, ఈ సభ కోసం బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు ప్రారంభించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.