డేట్, టైమ్, ప్లేసు మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే!: సీఎం జగన్ కు సవాల్ విసిరిన వర్ల రామయ్య
- చంద్రబాబుపై వైసీపీ మంత్రుల ఆరోపణలు
- మండిపడిన వర్ల రామయ్య
- దమ్ముంటే తనతో సీఎం జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరగడం పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే. చంద్రబాబునాయుడు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డాడంటూ వైసీపీ మంత్రులు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శనాస్త్రాలు సంధించారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు.
"డేట్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే... టైమ్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే.... ప్లేసు మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే.... దమ్ముంటే చంద్రబాబు ఆస్తులపై చర్చకు రాగలరా జగన్ మోహన్ రెడ్డీ! నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. బహిరంగ చర్చకు రాగలవా? ప్రజల్లోకి వచ్చే దమ్ము, ధైర్యం ఉందా? నీ ఆస్తుల చిట్టా విప్పగలవా? జగన్ మోహన్ రెడ్డి గారూ, నేనెప్పుడు మీ ఆస్తుల గురించి ప్రశ్నించినా గజగజ వణుకుతారెందుకు? వర్ల రామయ్య ప్రశ్నిస్తే మీ కాళ్లలో వణుకు పుడుతుంది ఎందుకు?
నన్నడుగు నా ఆస్తుల గురించి చెబుతా. చంద్రబాబు గారి ఆస్తుల గురించి నెట్ లో ఉంటాయి చూసుకో. ఇన్ కమ్ ట్యాక్స్ వాళ్లను అడిగినా చెబుతారు. ఒకవేళ ఎక్కువ ఆస్తులు ఉంటే నువ్వే కొట్టేయ్.. నీ ఆస్తుల్లో కలిపేసుకో. ఓ ప్రెస్ నోట్ పట్టుకుని దుష్ప్రచారం చేస్తే మీడియా ఆ చెంపా ఈ చెంపా వాయించేసింది. బొక్కబోర్లా పడ్డారు. సాక్షి మీడియా సిగ్గుతో తలవంచుకుంది" అంటూ వర్ల రామయ్య మండిపడ్డారు.