తండ్రిని కోల్పోయిన శ్రీకాంత్ కు చిరంజీవి ఆత్మీయ పరామర్శ

తండ్రిని కోల్పోయిన శ్రీకాంత్ కు చిరంజీవి ఆత్మీయ పరామర్శ
  • శ్రీకాంత్ కు పితృవియోగం
  • అనారోగ్యంతో మరణించిన మేకా పరమేశ్వరరావు
  • శ్రీకాంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కు పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తండ్రి మేకా పరమేశ్వరరావు తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలియడంలో మెగాస్టార్ చిరంజీవి తన సన్నిహితుడైన శ్రీకాంత్ నివాసానికి వెళ్లారు. మేకా పరమేశ్వరరావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి ఆపై శ్రీకాంత్ తో మాట్లాడారు. మరణానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. తండ్రిని కోల్పోయిన విషాదంలో ఉన్న శ్రీకాంత్ ను ఓదార్చారు. అంతకుముందు, చిరంజీవిని చూడగానే శ్రీకాంత్ భావోద్వేగాలకు లోనై ఆయనను హత్తుకున్నారు. ఆ సమయంలో మరో హీరో గోపీచంద్ కూడా అక్కడే ఉన్నారు. శ్రీకాంత్ తండ్రి అంత్యక్రియలను ఈ మధ్యాహ్నం హైదరాబాద్ ఫిలింనగర్ మహాప్రస్థానం శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.



More Telugu News