'సాక్షి'ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అన్ని ఆధారాలున్నాయి.. ఫిర్యాదు చేస్తాం: యనమల

  • ఐటీ దాడులపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు
  • ప్రెస్‌ కౌన్సిల్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ను కలుస్తాం
  • తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగానే మా విధానం ఉంటుంది
ఆదాయపన్ను శాఖ అధికారులు ఇటీవల జరిపిన దాడులపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఇటువంటి వార్తలు ప్రచురించిన 'సాక్షి'ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు అన్ని ఆధారాలున్నాయని, తాము ప్రెస్‌ కౌన్సిల్‌, ఎడిటర్స్‌ గిల్డ్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాసన మండలి అంశంపై స్పందించారు.

రాజధాని అంశంపై సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటు ఫైల్స్ ను మళ్లీ వెనక్కి పంపడం రాజ్యాంగ విరుద్ధమని యనమల తెలిపారు. శాసన పరిషత్‌ కార్యదర్శిపై చర్యలు తీసుకొనే అధికారం మండలి ఛైర్మన్‌కు ఉందని చెప్పారు. తమ ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్లి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతికి వాస్తవ పరిస్థితులను వివరిస్తారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలకు వ్యతిరేకంగానే తమ విధానం ఉంటుందన్నారు.


More Telugu News