ఖర్చు విషయంలో ఎన్టీఆర్ అలా వుండేవారు: నిర్మాత దొరస్వామిరాజు
- ఎన్టీఆర్ తో మంచి అనుబంధం వుంది
- ఉదయాన్నే ఆయనను కలిసేవాడిని
- ఆయన జాగ్రత్త మనిషన్న దొరస్వామిరాజు
తెలుగు చిత్రపరిశ్రమలో అభిరుచి కలిగిన నిర్మాతగా దొరస్వామిరాజుకి మంచి పేరు వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీ రామారావు గురించిన విషయాలను కూడా పంచుకున్నారు. "ఎన్టీరామారావు గారితో నాకు మంచి అనుబంధం వుండేది. ఆయనతో సినిమాలు నిర్మించలేదుగానీ, ఆయన సినిమాలు చాలావరకూ నేను డిస్ట్రిబ్యూట్ చేశాను.
ఆయనను కలవడానికి ఉదయాన్నే 5 గంటలకు వెళ్లేవాడిని. ఆ సమయంలో ఆయన బసవతారకంగారితో మాట్లాడుతూ ఉండేవారు. ఆ రోజున ఇంట్లో ఏమేం చేయాలి? దేనికి ఎంత అవుతుంది? అనేది లెక్క చూసి ఆమెకి ఇచ్చేవారు. 'వారానికో .. నెలకో ఒకసారి ఇస్తే సరిపోతుంది గదా? ఏ రోజుకారోజు ఇవ్వడం ఎందుకండీ?' అన్నాను ఒకరోజు నేను. 'రాజుగారు .. మీరు కుర్రవారు మీకేం తెలుసు?' అని అన్నారాయన. డబ్బు విషయంలో ఆయన అంత జాగ్రత్తగా ఉండేవారు" అంటూ చెప్పుకొచ్చారు.