ఆరు నెలల తరువాత కృష్ణమ్మ ఒడి నుంచి బయటకు వచ్చిన సంగమేశ్వరుడు!
- శ్రీశైలం జలాశయంలో తగ్గుతున్న నీరు
- శివరాత్రి సమయానికి ఆలయమంతా బయటకు
- ప్రస్తుతం కనిపిస్తున్న గోపురం
దాదాపు ఆరు నెలల క్రితం ఆగస్టులో కృష్ణానదిలోకి వరద పెరగడంతో, శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ లో నీట మునిగిన సంగమేశ్వరాలయం, ఇప్పుడు నీరు తగ్గడంతో బయటకు వచ్చింది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో కృష్ణా నది మధ్య వెలసిన సంగమేశ్వరుని దేవాలయం గోపురం బయటకు వచ్చింది.
నిన్న సాయంత్రం నీటిమట్టం 866 అడుగులకు తగ్గడంతో శిఖరం కనిపించడం మొదలైంది. మరో ఆరేడు అడుగులు తగ్గితే, ఆలయంపై మెట్లు కనిపిస్తాయని స్థానికులు వెల్లడించారు. ఆపై నీటిమట్టం మరో 35 అడుగులు తగ్గినప్పుడు ఆలయం మొత్తం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. మహా శివరాత్రి వచ్చే సమయానికి ప్రధానాలయం మొత్తం కనిపిస్తుందని, ఈ సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు సంగమేశ్వరుడికి పూజలు చేసేందుకు తరలి వస్తారని ప్రధానార్చకుడు తెలకపల్లి రఘురామ శర్మ వెల్లడించారు.