కాకతీయ కెనాల్ లో బయటపడ్డ కారు, మూడు మృతదేహాలు... 15 రోజుల క్రితమే ప్రమాదం!
- కాలువలో నీరు తగ్గడంతో బయటపడ్డ కారు
- కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు
- కేసును విచారిస్తున్న పోలీసులు
కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండి కాకతీయ కెనాల్ లో ఓ కారు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. నిన్నటి వరకూ కెనాల్ లో నిండా నీరుండగా, అధికారులు నీటి విడుదలను నిలిపివేయగానే, కారు బయటకు కనిపించింది. యాదాలపల్లి సమీపంలోని అలుగునూరు వద్ద కెనాల్ లో కారును గమనించిన స్థానికులు, విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
ఈ కారు దాదాపు 2 వారాల క్రితమే నీటిలో పడి వుండవచ్చని నిర్ధారించిన పోలీసులు, కారులో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను గుర్తించారు. కారు నీటిలో పడి 15 రోజులు గడవడంతో మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయని తెలిపారు. కారు నంబర్ ఆధారంగా ఇది కరీంనగర్ బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న నర్రె శ్రీనివాసరెడ్డిదిగా గుర్తించామని అన్నారు. కేసును విచారిస్తున్నామని వెల్లడించారు.