భైంసాలో ఔరంగజేబు, శివాజీ పోరు సాగుతోంది: బీజీపీ ఎంపీ బండి సంజయ్

  • భైంసాలో బాధిత కుటుంబాలకు బీజేపీ నేతల పరామర్శ
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటన
  • సీఎం కేసీఆర్ కు దమ్ముంటే భైంసాకు రావాలి
ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ఇటీవల జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలను బీజేపీ నేతలు పరామర్శించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు లు భైంసా ప్రాంతంలో ఈరోజు పర్యటించారు. అనంతరం మీడియాతో సంజయ్ మాట్లాడుతూ,  ఈ ఘటనను ‘చిన్న లొల్లి’గా పేర్కొన్న సీఎం కేసీఆర్ కు దమ్ముంటే భైంసాకు రావాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం టీఆర్ఎస్ పార్టీ మరింతగా దిగజారుతోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఎంఐఎంపై నిప్పులు చెరిగారు. ఎంఐఎంను ‘అంతర్రాష్ట్ర  దొంగలముఠా’గా అభివర్ణించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ అల్లర్లు పునరావృతమైతే అదే స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. భైంసాలో ఔరంగజేబు, శివాజీ మధ్య పోరు సాగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్, ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.


More Telugu News