ఐతే ఏమైంది.. పక్కన నాలుగు సున్నాలు పెడితే పోలా అని జగన్ ఆదేశించారు: బుద్ధా వెంకన్న

  • ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల్లో సోదాలపై వచ్చిన వార్తలపై బుద్ధా ఫైర్
  • 2 వేల కోట్లు అంటూ సాక్షిలో వార్తలు
  •  ఉన్నది 2 లక్షల 63 వేలు,12 తులాల బంగారం 
  • విజయసాయిరెడ్డి నాలుగు సున్నాలు తగిలించారు
'దొంగలను చూసి మొరగాల్సిన కుక్కలు తోకలు ఊపుతున్నాయి. చంద్రబాబు ట్రయినింగ్ అలాగే ఉంటుంది' అంటూ 'ఏబీవీ సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది' అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఒకరికి చెందిన మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో రూ. 2,000 కోట్లకు పైగా లావాదేవీల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలపై బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
 
'2 వేల కోట్లు అంటూ సాక్షి సిత్రాలు, వైకాపా నాయకులు ఆడుతోన్న డ్రామాలు పటాపంచలు అయ్యాయి. ఉన్నది 2 లక్షల 63 వేలు,12 తులాల బంగారం. అంత సొమ్ము మాకొద్దు అని తిరిగి ఇచ్చేశారు కూడా' అని తెలిపారు.

'అయితే ఏమైంది.. పక్కన నాలుగు సున్నాలు పెడితే పోలా.. అని జగన్ గారు ఆదేశించారు. సున్నాలు పెట్టి జగన్ గారిని ముంచడంలో నిష్ణాతుడు అయిన విజయసాయిరెడ్డి నాలుగు సున్నాలు తగిలించి 2 వేల కోట్లు అని మొరిగి మరోసారి వైకాపా దొంగల ముఠాని ముంచేశారు' అని ఎద్దేవా చేశారు.



More Telugu News