ఈ వార్తను పత్రికలు చిన్నదిగా చేసి రాశాయి: విజయసాయిరెడ్డి

  • ఏబీవీ సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది
  • డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా? అని గగ్గోలు పెట్టారు
  • ఇప్పుడు బాబు బ్యాచ్ కిక్కురుమనడం లేదు
  • ఎప్పటిలాగే ఎల్లో మీడియా తమ జాతి రత్నాన్ని వెనకేసుకొచ్చింది
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్లు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఆయనపై వైసీపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించినప్పటికీ ఊరట లభించలేదు. తనపై విధించిన సస్సెన్షన్ చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేయగా స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ వార్తా పత్రికలపై విమర్శలు గుప్పించారు.

'ఏబీవీ సస్పెన్షన్ పై స్టే ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తారా? అని గగ్గోలు పెట్టిన బాబు బ్యాచ్ కిక్కురుమనడం లేదు. ఎప్పటిలాగే ఎల్లో మీడియా తమ జాతి రత్నాన్ని వెనకేసుకొచ్చింది. స్టే దొరకలేదనే విషయాన్ని పత్రికల్లో చిన్నదిగా చేసి రాశాయి' అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.


More Telugu News