తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఎండీ సునీల్ శర్మ శుభవార్త!
- బెస్ట్ కేఎంపీఎల్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఎండీ
- ఆర్టీసీ లాభాల్లోకి వచ్చేసినట్టేనన్న సునీల్‌శర్మ
- ఉద్యోగుల భద్రతపై వారం రోజుల్లో కీలక ప్రకటన
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆ సంస్థ ఎండీ సునీల్‌శర్మ శుభవార్త చెప్పారు. ఆర్టీసీ లాభాల బాట పట్టిందని, ఈ ఏడాది డిసెంబరులో బోనస్ ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ‘ఇంధనం అధికంగా వాడకు.. పర్యావరణం పరిరక్షించు’ అన్న నినాదంతో నిర్వహించిన బెస్ట్ కేఎంపీఎల్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సునీల్‌శర్మ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల భద్రతపై వారం రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.
ఉద్యోగుల ఓడీలు, బదిలీలపై చర్చిస్తున్నట్టు చెప్పారు. సంక్షేమ కమిటీల సహకారంతో మౌలిక సౌకర్యాల కల్పనపై చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే కార్గో సౌకర్యం రాబోతున్నట్టు వెల్లడించారు. సంస్థ ఇప్పటికే లాభాల్లోకి వచ్చిందని, కార్గో సేవల ద్వారా సంస్థకు మరింత ఆదాయం సమకూరుతుందని సునీల్‌శర్మ పేర్కొన్నారు.